Sunday, December 22, 2024

భారతీయ న్యాయవాదికి “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ ” అవార్డు

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ లోని ప్రఖ్యాత భారతీయ న్యాయవాది అజిత్ మిశ్రాకు అత్యంత ప్రతిష్ఠాత్మక “ ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ ” అవార్డు లభించింది. ప్రజాసేవలోను, న్యాయపరంగా విశిష్టమైన సేవలు అందించినందుకు ఈ అవార్డుకు ఆయన ఈనెల 23న ఎంపికయ్యారు. పాలసీ ఛైర్మన్ ఆఫ్ లండన్ కార్పొరేషన్ క్రిస్ హేవర్డ్, సివిల్ ఎఫైర్స్ కమిటీ డిప్యూటీ ఛైర్ శరవణ్ జోసి ఈ వార్డుకు మిశ్రాను నిర్ధారించారు.

ఈ అవార్డును అందుకోవడం గర్వకారణంగా ఉందని, తన లీగల్ కెరీర్ లండన్ సిటీలో ప్రారంభమైందని, లండన్‌సిటీ తనను గుర్తించడం గర్వకారణంగా మిశ్రా తన భావోద్వేగాన్ని వెల్లడించారు. యుకె ఇండియా లీగల్ పార్ట్‌నర్‌షిప్ (యుకెఐఎల్‌పి) సంస్థాపకులైన మిశ్రా ఉత్తమ న్యాయవాదిగా, కార్పొరేట్ భాగస్వామిగా పేరు గడించారు. భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య వ్యవహారాలు నిర్వహించడంలోను, వృత్తిపరమైన నైపుణ్యం సాధించారు. 13 వ శతాబ్దం లో నెలకొల్పిన సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ఈ అవార్డును అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News