Wednesday, January 22, 2025

ఆడవారిలో కన్నా మగవారిలో రక్తపోటు నియంత్రణ రేటు తక్కువ: లాన్సెట్ అధ్యయనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దేశంలో దాదాపు 75 శాతం హైపర్ టెన్షన్ రోగులు నియంత్రించలేని రక్తపోటుతో బాధపడుతున్నారని, కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే బతికిబట్టకడుతున్నారని ‘లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్’ ఇటీవల ప్రచురించింది. ఆడవారిలో కన్నా మగవారిలో హైపర్ టెన్షన్ నియంత్రణ తక్కువగా ఉన్నదని లాన్సెట్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఇంకా తక్కువగా ఉందని పేర్కొంది. హైపర్‌టెన్షన్ లేక హైబ్లడ్ ప్రెషర్ గుండెపోటుకు ప్రధాన కారణమవుతోందని గుర్తించారు. హైపర్ టెన్షన్ నియంత్రించేందుకు తగిన వ్యూహాలను భారత్ కనుగొనాల్సి ఉందని తెలిపింది. ‘భారత్‌లో హైపర్‌టెన్షన్ కారణంగానే అనేక మంది చనిపోతున్నారు’ అని రిపోర్టు రచయిత తెలిపాడు.

సిస్టోలిక్ రక్తపోటు 140 ఎంఎంహెచ్‌జి(ఒత్తిడి యూనిట్) కంటే తక్కువ, డయాస్టోలిక్ రక్తపోటు 90ఎంఎంహెచ్‌జి కంటే తక్కువ ఉంటే రక్తపోటు నియంత్రణ రేటు నియంత్రణలో ఉన్నట్లుగా భావించాలని లాన్సెట్ తన అధ్యయనంలో పేర్కొంది. అధ్యయన బృందంలో కేరళలోని మంజేరికి చెందిన ప్రభుత్వ వైద్య కళాశాల, పెరింతల్మన్నకు చెందిన కిమ్స్ అల్‌షిఫా స్పెషాలిటీ హాస్పిటల్ పరిశోధకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News