Sunday, December 22, 2024

న్యూజిల్యాండ్ లో భారతీయుడికి జాతి వివక్ష తిప్పలు!

- Advertisement -
- Advertisement -

రెండేళ్ల క్రితం ఓ భారతీయుడు న్యూజిల్యాండ్ కు వెళ్లి స్థిరపడ్డాడు. న్యూజిల్యాండ్ కు వెళ్లడానికి ముందు అనేక రకాలుగా ఆ దేశం గురించి ఊహించుకున్నాడు. కానీ అక్కడ అతడికి చేదు అనుభవం ఎదురయింది. ఆ విషయాలను అతడు ‘రెడ్ యిట్’  ఆన్ లైన్ పోస్ట్ లో షేర్ చేశాడు. అయితే అతడు తన ఉనికి, తదితర వివరాలను వెళ్ళడించలేదు.

నేను అనుకున్నదానికంటే ఎక్కువ జాతి వివక్ష ను ఎదుర్కొన్నాను.  పని చేసే ప్రదేశంలో నా యాస, అప్పీరెన్స్ మీద అనేక వ్యాఖ్యలు ఎదుర్కొన్నాను. నన్ను దూరం పెట్టేవారు. ‘‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్లిపో’’ అనేవారన్నాడు. న్యూజిల్యాండ్ లో మమైకపోయేందుకు నేను ప్రయత్నించాను. న్యూజిలాండ్ లో ప్రజలు ప్రవాసులను విశ్వసించరు. నేను ఇదివరలో బెర్లిన్ కూడా వెళ్లాను. అక్కడ కూడా జాతి వివక్షను ఎదుర్కొన్నాను. ఎక్కడికెళ్లిన ఈ జాతి వివక్ష కనిపిస్తుంటుంది. నేను కెనడా లో ఉండి, బిజినెస్ చేశాను. ప్రజలు ప్రవాసులను నమ్మరు. ముఖ్యంగా మీ అనుభవం, సలహాకు చెల్లింపులు హృదయపూర్వకంగా చేయరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News