న్యూయార్క్ : అమెరికాలో ఫ్రాడ్‌స్కీమ్‌తో వృద్ధులను మోసం చేసిన కేసులో భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. 201920 మధ్య ఓ ఫ్రాడ్ రింగ్ ఆపరేట్ చేసిన కేసులో ఎండీ ఆజాద్ ను దోషిగా తేల్చారు. అమెరికా జడ్జి కెన్నెత్ హోయట్ తన ఆదేశాల్లో ఆజాద్‌కు 188 నెలల జైలు శిక్ష ఖరారు చేశారు. హూస్టన్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆజాద్ , మనీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ ద్వారా అమెరికా లోని పలు నగరాలకు చెందిన వృద్ధులను మోసం చేశాడు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి వ్యక్తిగత , బ్యాంకు, క్రెడిట్ కార్డు సమాచారాన్ని చోరీ చేశాడు.
ఆ తర్వాత ఫేక్ కాల్స్‌తో ఆ వృద్ధులను వేధించినట్టు అమెరికా అటార్నీ ఆలందార్ హమ్‌దాని తెలిపారు. ఈ కేసులో ఆజాద్ రింగ్ లీడర్ కాగా, అతనికి మరికొంతమంది భారతీయులు సహకరించారు. వారిలో అనిరుధ్ కల్‌కోటే, సుమిత్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్ , ఎండీ హసీబ్ ఉన్నారు. ప్రస్తుతం ఐదుగురు కస్టడీలో ఉన్నారు. మిగతా వాళ్లకు కూడా శిక్ష పడాల్సి ఉంది. బాధితులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయినట్టు యూఎస్ అటార్నీ పేర్కొన్నారు.