ఇజ్రాయెల్ లో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ భారతీయుడిని జోర్డాన్ సైనికులు సరిహద్దుల్లో కాల్చివేశారు. అతడు కేరళకు చెందిన థామస్ గేబ్రియేల్ పెరీరాగా గుర్తించారు. అతడు విజిటర్ వీసా మీద జోర్డాన్ కు వచ్చి అక్కడ నుంచి ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించినట్లు జోర్డాన్ సైనికులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ఈ ఘటన జరిగింది.
భారతీయ పౌరుడు ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో మరణించడం విచారకరమని జోర్డాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం పేర్కొంది.
భారతీయ రాయబార కార్యాలయం కుటుంబ సభ్యులను సంప్రదించిందని, అతడి మృతదేహాన్ని కేరళకు పంపేందుకు జోర్డాన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొంది. పెరీరా బంధువు ఎడిసన్ అనే వ్యక్తి కూడా ఇజ్రాయెల్ లో ప్రవేశించేందుకు యత్నించి సైన్యం కాల్పుల్లో గాయపడ్డాడు. అతడికి చికిత్స చేయించి భారతదేశానికి పంపారు.హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా వెస్ట్ బ్యాంక్ లో హింస జరుగుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.