Monday, December 23, 2024

ఖండాలు దాటిన ప్రేమ: ఒక్కటైన జంట

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్: మయన్మార్ దేశానికి చెందిన యువతి గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన యువకుడు మధ్య చిగురించిన ఎల్లలు దాటింది వారి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో సోమవారం వారి వివాహం ఘనంగా జరిగింది. మయన్మార్ దేశానికి చెందిన యువతి జిన్ నెహ్రు థియేన్ గుడిహత్నూర్ మండలంలోని చింతగుడ గ్రామానికి చెందిన గొల్లపెల్లి తిమోతి కరుణల కుమారుడు గొల్లపల్లకి రవికుమార్ ఖతర్ దేశంలో హోటల్ మేనేజ్మెంట్‌గా పని చేస్తూ ప్రేమించుకున్నారు.

ఈ విషయాన్ని రవికుమార్ తమ తల్లిదండ్రులకు తెలుపడంతో వారి పెళ్లికి ఒప్పుకోగా ఇరువై రోజుల క్రితం యువతి చింతగూడ గ్రామానికి చేరుకుంది. సంప్రదాయబద్దంగా వీరి వివాహం సోమవారం చింతగూడలో సెయింట్ చర్చిలో క్రైస్తవ మత పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ పెళ్లికి అమ్మాయి తరపున ఆమె సోధరుడు క్యాహు క్యాహు థియేన్ హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News