మాస్కో: ఇదివరలో భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్ ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు రష్యాను ఎంచుకుంటున్నారు. భారత్ లో వైద్య విద్య చదవడం కష్టం. సీటు సంపాదించడమే మహా కష్టం. పోటీ తీవ్రంగా ఉంటుంది. పైగా పెద్ద మొత్తంలో వెచ్చించి ఎన్నో ఏళ్లు చదవాల్సి ఉంటుంది. అదే కొన్ని ఇతర దేశాలలో వైద్య విద్య చదవడానికి షార్ట్ కట్ రూట్ ఎంచుకుంటుంటారు.
ప్రస్తుతం15000 కు పైగా భారతీయ విద్యార్థులు రష్యాలో వైద్య విద్య కోర్సు చదువుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు రష్యా కు ప్రాధాన్యతనిస్తున్నారు. రష్యా వీసా నిబంధనలను భారతీయులకు సులభతరం చేసింది. పైగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు. దాంతో నిష్పత్తి పెరిగింది.
రష్యాలో జాత్యాహంకారం ఉండదు. పైగా అక్కడ భారతీయులకు విలువనిస్తారు. పైగా రష్యా వారు భారతీయ సంస్కృతిని ఆదరిస్తున్నారు. వారికి మన హిందీ సినిమాల గురించి బాగా తెలుసు. భారతీయులు రష్యాలో స్వంత దేశంలో ఉన్నట్లు ఫీలవుతుంటారని అక్కడ ఉండే భారతీయ విద్యార్థి నాయకుడు డాక్టర్ అశోక్ పటేల్ తెలిపారు.
VIDEO | Dr Ashok Patel, Indian students representative at Orenburg State Medical University talks about the rising influx of Indian students in Russia for medical studies. Prime Minister Narendra Modi is scheduled to visit Russia for two days starting July 8. Here's what he said.… pic.twitter.com/E3N7aR8nVd
— Press Trust of India (@PTI_News) July 7, 2024