Sunday, December 22, 2024

వాలీబాల్‌లో భారత్ గెలుపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం చైనీస్‌తైపీతో జరిగిన వాలీబాల్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 30 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. తైపీతో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత్ 25-22, 25-22, 25-21 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే భారత్ దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థి టీమ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. తైపీ ఆటగాళ్లు కూడా కాస్త బాగానే ఆడినా ఫలితం లేకుండా పోయింది. పూర్తి ఏకగ్రాతతో ఆడిన భారత్ వరుసగా మూడు సెట్లను గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News