టోక్యో: ఒలింపిక్స్ హాకీ పూల్ ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆసీస్ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో గెలవడం విశేషం. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి శుభారంభం చేసిన పురుషుల జట్టు.. ఈ మ్యాచ్లోఆస్ట్రేలియాకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తనకు అంది వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా.. మరోవైపు ఆసీస్‌కు గోల్స్ మీద గోల్స్ సమర్పించుకుంది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన ఆ టీమ్.. రెండో క్వార్టర్లోమరో మూడు గోల్స్ చేసి 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో క్వార్టర్లో దొరికిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని గోల్‌గా మలచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 1-4కు తగ్గించినా.. ఆ వెంటనే మరో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇక చివరి క్వార్టర్లో మరో గోల్ చేసిన ఆస్ట్రేలియా 7-1తో విజయం సాధించింది.
Indian Mens Hockey Team lost to Australia