Monday, December 23, 2024

నాకౌట్‌కు భారత్ అర్హత

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాపై 160 తేడాతో ఘన విజయం
ఆసియా కప్ హాకీ టోర్నీ

జకర్తా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు నాకౌట్‌కు అర్హత సాధించింది. గురువారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ 160 గోల్స్ తేడాతో ఆతిథ్య ఇండోనేషియాను చిత్తుగా ఓడించి సూపర్4 రేసులో నిలిచింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఆరంభం నుంచే వరుస గోల్స్‌తో చెలరేగి పోయింది. భారత్ ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి జట్టను హడలెత్తిస్తూ గోల్స్ వర్షం కురిపించింది. భారత్ జోరుకు ఇండోనేషియా ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ప్రథమార్ధంలో భారత్ 60 ఆధిక్యంలో నిలిచింది.

పవన్ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత భారత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ద్వితీయార్ధంలో ఏకంగా పది గోల్స్ సాధించి నాకౌట్ రేసులో నిలిచింది. డిప్సెన్ టిర్కీ అత్యధికంగా ఐదు గోల్స్ చేయగా, సుదేవ్ మూడు గోల్స్ సాధించాడు. సునీల్, పవన్, కార్తీలు రెండేసి గోల్స్ నమోదు చేశారు. ఇక నాకౌట్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో 16 గోల్స్ తేడాతో గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు ఎదురైంది. ఈ కఠిన సవాల్‌ను టీమిండియా అధిగమించి సూపర్4లో చోటు సంపాదించింది. ఇక పాకిస్థాన్ కూడా నాలుగు పాయింట్లు సాధించినా ఒక గోల్ తక్కువగా ఉండడంతో నాకౌట్ రేసుకు అర్హత సాధించలేక పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News