Wednesday, January 22, 2025

ఇండియన్ మ్యూజియంకు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

కొల్‌కతా : స్థానికంగా ఉన్న 200 ఏండ్ల నాటి ఇండియన్ మ్యూజియంకు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడి అధికారులకు అందిన ఇ మొయిల్ సమాచారంలో భవనంలో బాంబు ఉందని అజ్ఞాత వ్యక్తులు తెలిపారు. దీనితో వెంటనే సందర్శకులను నిలిపివేసి , భవనం అంతటా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.

కొల్‌కతా పోలీసు బృందాలు భవనానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మరో వైపు నగర సైబర్ పోలీసు విభాగం రంగంలోకి దిగింది. ఇ మొయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరు బాధ్యులు ? అనేది నిర్థారించేందుకు సాంకేతిక చర్యలు చేపట్టారు. 1814లో ఇక్కడి ఇండియన్ మ్యూజియం ఏర్పాటు అయింది. అతి పురాతన అతి విశాల మ్యూజియంగా ఇండియన్ మ్యూజియం పేరు తెచ్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News