Wednesday, January 22, 2025

వృద్ధుల స్కీంలతో స్కామ్

- Advertisement -
- Advertisement -

Indian national arrested in US

భారతీయ యువకుల అరెస్టు

వాషింగ్టన్ : వృద్ధులను లక్షంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడనే అభియోగాలపై భారతీయ సంతతికి చెందిన అనిరుద్ధ కల్కోటేను అరెస్టు చేశారు. వర్జినియాలో ఉంటున్న ఈ 24 ఏండ్ల యువకుడిని హుస్టన్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఆయనతో పాటు పాతికేళ్ల ఎండి ఆజాద్‌పై కూడా విచారణ జరుగుతోంది. ఈ వ్యక్తి హుస్టన్‌లో అక్రమంగా నివాసంలో ఉంటున్నారు. పలు రకాల ప్రలోభాలకు గురి చేసి అనిరుద్ధ ఇతరులతో కలిసి రింగ్‌గా ఏర్పడి మొయిల్ చేయడం ద్వారా , గిఫ్ట్‌ల పేరిట భారీగా డబ్బులు లాగుతున్నట్లు వెల్లడైంది. వీరంతా కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయితే చట్టపరంగా తీవ్రస్థాయిలో 20 ఏండ్ల జైలు, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News