Wednesday, January 22, 2025

మెక్సికోలో భారతీయుడి కాల్చివేత: 10 వేల డాలర్ల దోపిడీ

- Advertisement -
- Advertisement -

హూస్టన్: మెక్సికో నగరంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో ఇక్కడే నివసిస్తున్న ఒక భారత జాతీయుడు మరనించగా మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు.

దుండగులను త్వరితంగా అరెస్టు చేయాలని భారతీయ అధికారులు మెక్సికన్ అధికారులను కోరారు.ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధితుల వద్ద నుంచి 10,000 డాలర్లను కూడా దుండగులు దోచుకున్నారు. మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దుండగులు డబ్బును చేతులు మార్చుకున్నట్లు ఒక స్థానిక వార్తాపత్రిక తెలిపింది.

తుపాకీ కాల్పులలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి సురక్షితంగా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడినట్లు పత్రిక తెలిపింది. ఈ ఘటనపై ఇక్కడి భారతీయ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబాన్ని సంప్రదించామని, అవసరమైన సహకారం అందచేస్తామని హామీ ఇచ్చామని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News