Sunday, November 17, 2024

సింగపూర్‌లో విద్యార్థినిపై అత్యాచారం: భారతీయునికి 16 ఏళ్ల జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

సింగపూర్: సింగపూర్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఒక 26 ఏళ్ల భారతీయునికి 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలను ఇక్కడి కోర్టు శిక్షగా విధించింది. బాధితురాలిని అపహరించడం, చోరీకి పాల్పడడం వంటి నేరాలకు కూడా నిందితుడు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.

2019 మే 4వ తేదీ సాయంత్రం పొద్దుపోయిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు సమీపంలోని బస్టాప్ వద్దకు చేరుకుంది. అక్కడే క్లీనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్య అనే భారతీయ పౌరుడు ఒంటరిగా ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లాడు. ఆమె మొహంపైన బలంగా కొట్టి ఆమెను ఈడ్చుకుంటూ సమీంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపడానికి కూడా చిన్నయ్య ప్రయత్నించాడు.

అత్యచారానికి పాల్పడిన అనంతరం ఆమె బ్యాగును వెతికి అందులోని వాటర్ బాటిల్‌ను తీసుకున్నాడు. కొన్ని నీళ్లు తాగి మిగిలిన నీళ్లను ఆమె శరీరంలోని కింది భాగంపై పోశాడు. చిన్నయ్య అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాధితురాలు తన బ్యాగులో దాచిన కత్తెరను తీసుకుని చేతిలో పట్టుకుని అతను తిరిగివస్తే దానితో పొడిచెయ్యాలని నిర్ణయించుకుంది. అయితే అతను తిరిగి రాకపోవడంతో ఆమె తన బ్యాలో ఉన్న సెల్‌ఫోన్ నుంచి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు.

చిన్నయ్యను అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక పరిస్థితిపై అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి మానసిక స్థితిని పరీక్షించడానికి సమయం పట్టడంతో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టిందని డిప్యుటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కయల్ పిళ్లై తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతోందని, గతం గుర్తుకొచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కూడా ఆమెలో ఏర్పడుతోందని, నిందితుడికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, 12కి తక్కువ కాకుండా లాఠీ దెబ్బలు శిక్షగా విధించాలని ఆయన కోర్టులో వాదించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News