భువనేశ్వర్ : 1971 లో భారత్‌పాకిస్థాన్ యుద్ధంలో భారత నేవీ తరఫున సాహసాన్ని ప్రదర్శించిన వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ సోమవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన నిండు నూరేళ్ల వయోవృద్ధుడు. ఆనాటి యుద్ధంలో శర్మ తూర్పు నావికాదళం కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా సాహసాన్ని ప్రదర్శించి పాకిస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర వహించారు. ఈ యుద్ధం ఫలితంగానే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. గత డిసెంబర్ 1న నూరో పుట్టిన రోజు పండగను చేసుకున్నారని, ఇటీవల ఢిల్లీలో జరిగిన అజాద్ అమృతోత్సవ్‌లో కూడా పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వెలిబుచ్చారు. భారత దేశంలో అనేక యుద్ధాలకు నాయకత్వం వహించి విజయం అందించడంలో శర్మ విశిష్ట పాత్ర వహించారని ఆయన ప్రశంసించారు. ఆయన ఎప్పుడూ తమకు స్ఫూర్తి ప్రదాతని కెప్టెన్ సంజీవ్ శర్మ నివాళి అర్పించారు.
ఇండియన్ నేవీ 1971 యుద్ధ వీరుడు వైస్ అడ్మిరల్ శర్మ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -