Wednesday, December 25, 2024

భారతీయ నౌకాదళంలోకి తొలి లేడీ ఆఫీసరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ నౌకాదళం కళకళలాడింది. నేవీలోకి తొలి మహిళా కమాండింగ్ ఆఫీసరును నియమించారు. ఈ విషయాన్ని నేవీ డే సందర్భంగా విలేకరుల సమావేశంలో అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలియచేశారు. సైనిక బలగాలలో మహిళలకు అన్ని ర్యాంకులు, అన్ని పాత్ర సూత్రం పాటింపు పద్ధతిని స్వీకరిస్తూ ఈ నియామకం జరిగిందని వివరించారు. గత ఏడాది కాలంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ నౌక విమానాల సంఖ్య పెరిగిందని, అత్యంత కీలక సముద్ర జలాలలో వీటి నిర్వహణ సామర్థం కూడా బాగా ఉందని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి బలోపేతంపై ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు ఎటువంటి విషయాలను అయినా నిశితంగా పరిశీలిస్తూ, తగు విధంగా వ్యవహరించే శక్తి సామర్థాలు నౌకాదళానికి ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News