Monday, December 23, 2024

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక దాడిపై దర్యాప్తు ప్రారంభించిన నేవీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి ఘటనలపై భారత నౌకాదళం దర్యాప్తు ప్రారంభించింది. సౌదీ అరేబియానుంచి మంగళూరుకు వస్తున్న ఈ నౌకపై డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌకమాత్రం స్వల్పంగా దెబ్బతింది. గుజరాత్‌తీరంలోని పోరుబందర్‌కు 401 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. లైబీరియా జెండాతో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎంవి కెమ్ ప్లూటో’ అనే ఈ వాణిజ్య నౌకలో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి విషయాన్ని బ్రిటన్‌కు చెందిన సముద్ర మారిటైం ఏజన్సీ అంబ్రే శనివారం తెలియజేసింది. దాడి వార్త తెలియగానే భారత నేవీ అధికారులు కోస్టుగార్డు నౌక ‘ ఐసిజిఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు.

దీనికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలోని నౌకలన్నింటినీ విక్రమ్ అప్రమత్త ంచేసినట్లు నేవీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక ముంబయి తీరానికి బయలుదేరింది. డ్రోన్ దాడి కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాక ఇది తిరిగి మంగళూరుకు బయలుదేరుతుంది.ఇజ్రాయెల్‌హమాస్ ఘర్షణల నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. అయితే నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News