Monday, November 18, 2024

చైనా జాతీయుడ్ని రక్షించిన భారత నేవీ

- Advertisement -
- Advertisement -

చైనాకు చెందిన సరకు రవాణా నౌకలో అత్యవసర వైద్య చికిత్స కావలసిన చైనా నావికుడిని భారత నౌకా దళం ఎంతో సాహసంతో రక్షించ గలిగింది. ముంబై తీరానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల ( సుమారు 370 కిమీ ) దూరంలో చైనాకు చెందిన ఝాంగ్ షాన్ మెన్ అనే సరకు నౌక ఉండగా, అందు లోని చైనా నావికుడికి అత్యవసర వైద్యం అందించాలని ముంబై లోని మారిటైం రెస్కూ కో ఆపరేషన్ సెంటర్‌కు విజ్ఞప్తి చేసింది.

అక్కడ నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడంతో సీకింగ్ హెలికాప్టర్‌తో భారత నావికాదళం రంగం లోకి దిగింది. తీవ్రమైన గాలులతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సాహసించి చైనా నౌక లోకి దిగింది. తీవ్రంగా నెత్తురోడుతున్న ఆ నావికుడిని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తీసుకు రాగలిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించి రక్షించ గలిగారు. ఈ పరిస్థితిలో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన సామ్రాట్ నౌకను కూడా సాయం కోసం వినియోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News