Sunday, December 22, 2024

సముద్రంలో ఇండియన్ నేవీ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

ముంబై : భారతీయ నౌకాదళ కమాండోలు హీరోలు అన్పించుకున్నారు. సొమాలియా తీరం వద్ద సముద్రజలాల్లో హైజాక్ గురైన ఎంవి లీలా నార్‌ఫోక్ కార్గో నౌకను దుండగుల చెర నుంచి తప్పించారు. నౌకలో ఉన్న భారతీయులు అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. భారతీయ నౌకాదళపు సుశిక్షత నేవీల మార్కోస్ బృందం వెంటనే రంగంలోకి దిగింది . అరేబియా సముద్రంలో హైజాక్ అయిన నౌకలోని వారిని విడిపించింది.

భారతీయ నౌకాదళం పరిస్థితిని గమనించి వెంటనే ఓ యుద్ధనౌకను, సముద్ర గస్తీ విమానాన్ని , హెలికాప్టర్‌ను , పి 81 , లాంగ్ రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్, ప్రిడేటర్ ఎంక్యూ9బిని రంగంలోకి దింపింది. షిప్‌ను చుట్టుముట్టిన దళం నౌకలోకి చేరుకుని అందరిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చింది. నౌకలోపల హైజాకర్లు ఎవరూ లేరని గుర్తించారు. భారతీయులతో పాటు ఇతర సిబ్బందిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News