Sunday, December 22, 2024

సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ

- Advertisement -
- Advertisement -

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా వెళుతుండగా అరేబియా సముద్రంలో ఇరాన్ ఫిషింగ్ ఓడ అల్-కాన్బర్‌ ను తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

సమాచారం అందుకున్న భారత నావికాదళం వెంటనే యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుమేధాను రంగంలోకి దింపింది. సముద్ర దొంగల అధీనంలో ఉన్న ఏఐ కంబార్‌ బోటును అడ్డగించింది. తర్వాత సువేధాకు ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ నౌక తోడై ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 12 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత సోమాలి సముద్రపు దొంగల నుండి 23 మంది పాకిస్తానీ పౌరులను రక్షించింది ఇండియన్ నేవీ. తొమ్మింది మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

సాధారణ ఫిషింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి రక్షించన బోటును సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు భారత నావికాదళ నిపుణుల బృందాలు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సముద్రతీర తనిఖీలను చేపట్టినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News