Monday, December 23, 2024

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

Indian Navy successfully test fires BrahMos missile

న్యూఢిల్లీ : బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతమైంది. వినియోగంలో లేని ఇండియన్ నేవీ పాత నౌకను ధ్వంసం చేసింది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ ఢిల్లీ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించినట్టు ఇండియన్ నేవీ బుధవారం తెలిపింది. ఐఎన్‌ఎస్ ఢిల్లీ యుద్ధ నౌకలో అప్‌గ్రేడ్ చేసిన మాడ్యులర్ లాంచర్ నుంచి తొలిసారి యాంటీ షిప్ వేరియంట్ క్షిపణిని వార్‌హెడ్ లేకుండా ప్రయోగించినట్టు పేర్కొంది. సర్వీస్‌లో లేని పాతనౌకను లక్షంగా చేసుకుని ఈ క్షిపణి ఢీకొట్టి భారీ రంధ్రం చేసినట్టు భారత నౌకాదళం వెల్లడించింది. ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ సెంట్రిక్ ఆపరేషన్లతోపాటు బ్రహ్మోస్ క్షిపణి దీర్ఘశ్రేణి లక్షా ల సామర్థాన్ని పరీక్షించినట్టు వివరించింది. గంటకు 3,000 కిమీ వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డుకోవడం చాలా కష్టమని భారత నౌకాదళ అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News