Friday, November 22, 2024

భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బంగాళాఖాతం లోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన టెస్ట్‌ఫైరింగ్ సకాలంలో లక్షాన్ని విజయవంతంగా చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన తూర్పు కమాండ్ లోని బంగాళాఖాతంలో ఫైరింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఆర్ క్లాస్ డిస్ట్రాయిర్‌షిప్, దాని ఆయుధాలు పూర్తిగా దేశీయంగా తయారై ఆత్మనిర్భర్ భారత్‌కు , సముద్రంలో భారత నేవీ ఫైర్ పవర్‌కు సంకేతంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చైనా పీఎల్‌ఏ నేవీ నుంచి ఎదురయ్యే ప్రతికూలతలతో సహా అన్ని సవాళ్లను ఇవి సమర్థవంతంగా ఎదుర్కోనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News