Thursday, January 23, 2025

ప్రాణదాతలైన వాయుసేన బలగం

- Advertisement -
- Advertisement -

అయోధ్య : రామాలయ ప్రాణప్రతిష్టకు వచ్చిన 65 ఏండ్ల రామకృష్ణ శ్రీవాత్సవకు ఉన్నట్లుండి సోమవారం గుండెపోటు వచ్చింది. విపరీతమైన రక్తపుపోటుతో తల్లడిల్లుతున్న ఆయన పరిస్థితి గురించి తెలియగానే భారత వాయుదళానికి (ఐఎఎఫ్) చెందిన తక్షణ సహాయక బృంద అనుబంధ సంచార ఆసుపత్రి స్పందించింది. ఆలయ ఆవరణలోనే భావోద్వేగంతో గుండెపోటుతో కుప్పకూలిన శ్రీవాత్సవను వాయుసేనకు చెందిన భీష్మ్‌క్యూబ్ దళం రక్షించింది. వింగ్ కమాండర్ మనీష్ గుప్తా సారధ్యంలోని ఈ బృందం వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించింది.

తక్షణ ప్రాధమిక చికిత్స జరిపారు. ఆయన రక్తపు పోటు ఏకంగా 210/170 స్థాయికి చేరిందని గుర్తించి ఈ టీం ఆయనకు అక్కడి తాత్కాలిక శిబిరంలోనే చికిత్స అందించడంతో ఈ వ్యక్తి క్రమేపీ కుదుటపడ్డారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వాయుసేనకు చెందిన అత్యంత అధునాతన ఏర్పాట్ల క్యూబ్‌దళపు సంచార ఆసుపత్రి శకటంలో అనేక చికిత్స హంగులు ఉన్నాయి. అత్యవసర స్థితిలో రోగులను ఆదుకునేందుకు ఈ మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు జరిగింది. ప్రాణప్రతిష్ట ఘట్టం దశలోనే ఓ వ్యక్తి ప్రాణ పరిరక్షణ జరిగినట్లు కేంద్ర సమాచారం ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ ఘటన గురించి ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News