Sunday, February 23, 2025

కొత్త యుద్ధనౌక మహేంద్రగిరి సెప్టెంబర్1న ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధనౌక చేరనున్నది. ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి సెప్టెంబర్ 1న జలప్రవేశం చేయనున్నది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భార్య సుదేష్ ధంఖర్ ముంబై లోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో దీన్ని ప్రారంభించనున్నారు. అడ్వాన్స్‌డ్ వెపన్స్, సెన్సార్లు, ఫ్లామ్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌వంటి అభివృద్ది చెందిన వ్యవస్థలు ఈ నౌకలోఉంటాయని నేవీ వెల్లడించింది. భారత నౌకాదళ స్వావలంబన, దేశం సాధించిన అద్భుతమైన పురోగతికి ఈ నౌక ప్రారంభం నిదర్శనమని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News