Monday, December 23, 2024

పైరెట్లతో ఢీకి సొమాలియా తీరానికి భారత యుద్ధ నౌక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సొమాలియా తూర్పు తీరానికి భారతీయ యుద్ధనౌకను అత్యవసర రీతిలో తరలించారు. పైరెట్ల గ్యాంగ్ ఒకటి ఇరాన్ మత్సనౌకను హైజాక్ చేశారని, కాపాడాలనే సందేశం అందడంతో ఐఎన్‌ఎస్ సుమిత్రను ఈ ప్రాంతంలోకి హుటాహుటిన తరలించినట్లు భారతీయ నావికదళ అధికారులు సోమవారం తెలిపారు. సముద్ర దొంగల బారిన పడిన నౌకపై ఇరాన్ జాతీయ జెండా ఉంది. సముద్రంలో హైజాకైన ఈ నౌకను , ఇందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు పూర్తి స్థాయి యాంటి పైరసీ నిర్వహణ సామర్థపు ఈ ఐఎన్‌ఎన్ సుమిత్ర రంగంలోకి దిగిందని ప్రకటనలో తెలిపారు. పైరెట్లు ఇరాన్ నౌకలోకి చొచ్చుకుని వచ్చి, దీనిని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వల్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News