Monday, December 23, 2024

అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. తెలుగు సంతతి యువకుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన 19 ఏళ్ల ఓ తెలుగు సంతతి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని మిస్సోరిలో ఉంటున్న యువకుడు ఫ్లైట్‌లో వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. వచ్చిరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లాడు. వైట్‌హౌస్‌లో ఉన్న బారీకేడ్లను ట్రక్కుతో ఢీకొడుతూ దూసుకొచ్చిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు.

ట్రక్కుపై నాజీ జెండాను గుర్తించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రెసిడెంట్ జో బైడెన్ ను హత్య చేసేందుకు 6 నెలలుగా ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు సేకరించి.. అతడిని భారత సంతతికి చెందిన సాయివర్షిత్‌ కందులగా గుర్తించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News