Friday, April 18, 2025

అమెరికాలో కాల్పులు.. భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కాన్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాన్సాస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. సెనెకాలో నగరంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అరుల్ కరసాల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కాన్సాస్ నగర ఆర్చ్‌డయోసెస్ ఆర్చ్‌బిషప్ జోసెఫ్ నౌమాన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఈ అర్థం లేని హింస మా నుంచి ఓ ప్రీస్ట్, నాయకుడు, మంచి స్నేహితుడిని దూరం చేసింది. మాకు బాధను మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు.

2004 నుంచి అరుల్ కరసాల ప్రీస్ట్‌గా తన సేవలు అందిస్తున్నారు. జూలై 11, 2011న ఆయన చర్చి పాస్టర్‌గా నియమితులయ్యారు. మత ప్రభోదకుడిగా.. అరుల్‌కు మంచి గుర్తింపు ఉంది. అంతేకాక.. 2011లోనే ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా అభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News