Monday, December 23, 2024

బ్రిటన్ లో భారత సంతతికి చెందిన జంటకు 33 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

అక్రమ మాదక ద్రవ్యాల ఎగుమతి కేసులో భారత సంతతికి చెందిన జంటకు బ్రిటన్ న్యాయస్థానం 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులు ఆర్తి ధీర్ (59), కవల్జిత్ సిన్హ్ రైజాడా (35) కొంతకాలంగా బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వాణిజ్య విమానాల ద్వారా కొకైన్ ను రవాణా చేస్తున్నట్లు యుకె పోలీసులు గుర్తించారు. వీరు పలు విడతల్లో దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన 514 కేజీల కొకైన్ ను ఆస్ట్రేలియాకు సరఫరా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దంపతులు ఇండియాలో హత్య కేసులో నిందితులు కావడం గమనార్హం.

ఆర్తి ధీర్, రైజాడా బ్రిటన్ లో కొన్నేళ్లుగా వీఫ్లై ప్రైట్ సర్వీసెస్ పేరిట కంపెనీ నడుపుతూ దీని ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ 15సార్లు ఆస్ట్రేలియాకు కొకైన్ ఎగుమతి చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హన్వెల్ ప్రాంతంలో వీరి నివాసం నుంచి సూట్ కేసులు, బాక్సులలో దాచిన మూడు మిలియన్ పౌండ్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ జంట గతంలో గుజరాత్ లో ఉండేవారు. అప్పట్లో తాము దత్తత తీసుకున్న 11 ఏళ్ల కుమారుడు గోపాల్ సెజానిని, అతని బావ హర్ సుఖ్ భాయ్ కర్దానీని  2017లో హత్య చేసి, బ్రిటన్ కు పారిపోయినట్లు అభియోగాలు ఉన్నాయి. గోపాల్ పేరిట 1.3 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని, ఆ తర్వాత అతన్ని హత్య చేసి ఆ డబ్బు కాజేసినట్లు గుజరాత్ పోలీసులు కేసు దాఖలు చేశారు. ఈ కేసు నిమిత్తం ఆర్తి ధీర్, రైజాడాలను తమకు  అప్పగించవలసిందిగా గతంలో ఇండియా చేసిన అభ్యర్థనను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News