Friday, January 3, 2025

యుఎఇలో విమాన ప్రమాదం.. భారత సంతతి వైద్యుని మృతి

- Advertisement -
- Advertisement -

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని రస్ అల్ ఖైమాహ్ తీరంలో సంభవించిన ఒక విమాన ప్రమాదంలో భారత సంతతి వైద్యునితో సహా ఇద్దరు మృతి చెందారు. ఆదివారం తేలికపాటి విమానం కూలిపోయిన ఘటనలో పైలట్, సహ పైటల్ ఇద్దరూ మృతి చెందినట్లు సార్వత్రిక పౌర విమానయాన ప్రాథికార సంస్థ (జిసిఎఎ) ఒక ప్రకటనలో తెలియజేసింది. విమానం సహ పైలట్‌గా వ్యవహరిస్తున్న సులేమాన్ అల్ మజిద్‌తో కలసి ప్రయాణిస్తున్న 26 ఏళ్ల పాకిస్తానీ మహిళ కూడా ప్రమాదంలో మరణించింది. యుఎఇలో జన్మించి, అక్కడే పెరిగిన 26 ఏళ్ల సులేమాన్ తన కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్ర అనుభవం కోసం విమానాన్ని అద్దెకు తీసుకున్నారు.

విమాన ప్రయాణాన్ని చూసేందుకు అతని తండ్రి, తల్లి, తమ్ముడు ఏవియేషన్ క్లబ్‌లో ఉన్నారని సమాచారం. ‘మేము ఒక కుటుంబంగా కొత్త సంవత్సరం వేడుక జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నాం. దానికి బదులుగా మా జీవితాలు చెదరిపోయాయి. మాకు కాలం స్తంభించిందనే భావన కలిగింది. సులేమాన్ మా జీవితాలకు కిరణం. అతను లేకుండా ఎలా ముందుకు సాగాలో మాకు తెలియడం లేదు’ అని సులేమాన్ తండ్రి చెప్పినట్లు యుఎఇ దినపత్రిక ‘ఖలీజ్ టైమ్స్’ వెల్లడించింది. బీచ్‌లో కోవ్ రోటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అనంతరం విమానం కూలిపోయిందని ఏవియేషన్ అథారిటీ తెలియజేసింది. సులేమాన్ యుకెలో డుర్హామ్ కౌంటీ,డార్లింగ్టన్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో క్లినికల్ ఫెలో అని అతని లింక్‌డిన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News