Tuesday, November 26, 2024

బిబిసి అధినేతగా భారతీయ సంతతి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

లండన్ : ప్రఖ్యాత వార్తాసంస్థ బిబిసి ఛైర్మన్‌గా డాక్టర్ సమీర్ షా నియమితులు అయ్యారు. డాక్టర్ సమీర్ భారతీయ సంతతి వారు. బిబిసి ఛైర్మన్‌గా ఆయన నియామకాన్ని గురువారం అధికారికంగా ధృవీకరించారు. అంతకు ముందు ఆయనను ఈ పదవికి ఎంపిక చేయడాన్ని కింగ్ చార్లెస్ ఆమోదించారు. షా గత 40 ఏండ్లుగా బిబిసిలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. బిబిసి ఛైర్మన్‌గా ఆయన పేరును గత ఏడాది డిసెంబర్‌లోనే బ్రిటన్ ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో ఆమోదించింది.

ఇప్పుడు 72 సంవత్సరాల షాను నాలుగేళ్ల హయాం ఉండే ఈ పోస్టుకు ఎంపికచేసినట్లు అధికారికంగా తెలిపారు. ఏడాదికి 1,60,000 పౌండ్ల వేతనం ఆయనకు ఉంటుంది. భారతీయ సంతతికి చెందిన ఒకరికి ఈ స్థానం దక్కడం ఇదే తొలిసారి. మార్చి 4వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 2028 మార్చి వరకూ కొనసాగుతారని ప్రకటనలో తెలిపారు. బిబిసి సమాచార పంపిణీ, జర్నలిస్టుల నియామకాలు పాలనా వ్యవస్థ వంటివాటికి ఆయన ప్రధాన అనుసంధానకర్తగా ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News