Wednesday, April 2, 2025

భారత సంతతి హోటల్ యజమాని కాల్పులకు బలి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన హోటల్ యజమాని కస్టమర్ కాల్పులకు బలైన సంఘటన అమెరికా లోని అలబామ రాష్ట్రంలో జరిగింది. హోటల్ రూమ్ విషయంలో తలెత్తిన వాగ్వాదం చివరకు హత్యకు దారి తీసింది. షెఫీల్డ్ లోని హిల్‌క్రెస్ట్ హోటల్ నిర్వహిస్తున్న 76 ఏళ్ల యజమాని ప్రవీణ్ రావూజీ భాయ్ పటేల్ గత వారం కస్టమర్ 34 ఏళ్ల విలియం జెరెమీ మోర్‌తో వాగ్వాదం జరగడం కాల్పులకు దారి తీసింది.

హోటల్ రూమ్ అద్దెకు కావాలని అడగడానికి వచ్చినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. మోర్ ఒక పాడుబడిన ఇంట్లో చొరబడుతుండగా పోలీస్‌లు పట్టుకోగలిగారు. నిందితుని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మృతునికి భార్య, పిల్లలు, మనుమలు ఉన్నారు. అమెరికా హోటల్ యజమానులు తీరని సంతాపం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News