Monday, December 23, 2024

లండన్ మేయర్‌ బరిలో మరో ముగ్గురు భారతీయులు

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైన లండన్ మేయర్ ఎన్నికలలో ఇద్దరు భారతీయ సంతతివారు కూడా బరిలో దిగారు. ఇప్పుడు మేయర్‌గా ఉన్న సాధిక్ ఖాన్‌కు పోటీదార్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ జాబితాలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వ్యాపారవేత్తలు తరుణ్ గుహ్లాటి , రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్యామ్ భాటియా కూడా పోటికి దిగుతున్నట్లు వేర్వేరుగా ప్రకటించారు.

దీనితో ఇప్పుడు మేయర్ అభ్యర్థికి పోటీదార్ల సంఖ్య డజన్ దాటేలా ఉంది. ఇప్పుడు తన పోటీకి ముందు ప్రచార పతాకశీర్షికగా గుహ్లాటి నమ్మిక ప్రగతిక అని జతచేర్చారు. కాగా భాటియా విశ్వాస దూతను అని ప్రకటించుకున్నారు. ఇప్పుడున్న మేయర్ సాధిక్ ఖాన్ పూర్వీకులు అవిభక్త భారతదేశంలోని లక్నోకు చెందిన వారే. అయితే సాధిక్ ఖాన్ పూర్తి స్థాయిలో బ్రిటిషర్‌గా స్థిరపడ్డాడు. అక్కడ ఎంపిగా కూడా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News