- Advertisement -
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతి కుటుంబంలో పెను విషాదం నింపింది. అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రంలో లంపాసస్ కౌంటీ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డల్లాస్‌లోని కాలేజీకి కూతురును తీసుకువెళ్లుతున్న దంపతులు అరవింద్ మణి (45), ప్రదీప అరవింద్ (40)ల కారు ఆక్సిడెంట్‌లో ధ్వంసం అయినట్లు ఈ ఘటనలో ఈ భార్య భర్తలు, వీరి కూతురు 17 సంవత్సరాల అండ్రిల్ అరవింద్ మృతి చెందినట్లు ఆస్టిన్ అమెరికన్ స్టేట్స్‌మెన్ పత్రిక తెలిపింది. కాగా ఈ ఘటన దశలో కారులో లేకపోవడంతో కుమారుడు 14 సంవత్సరాల అదిరయన్ ప్రాణాలు దక్కాయి. ఈ కుటుంబంలో ఈ బాబు ఒక్కడే మిగిలాడు. కారు వేగంతో వెళ్లుతూ మరో వాహనాన్ని ఢీకొందని స్థానిక ప్రత్యక్ష సాక్షులు, సిసీటీవీ కెమెరాల పరిశీలన తరువాత అదికారులు తెలిపారు. ఈ వాహనంలోని ఇద్దరు కూడా మృతి చెందారు.
- Advertisement -