Sunday, December 22, 2024

అమెరికాలో అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి..

- Advertisement -
- Advertisement -

అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రం డోవర్ పట్టణంలోని తమ విలాసవంతమైన భవనంలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు రాకేష్ కమల్ ( 57), టీనా (54),వారి కుమార్తె అరియానా (18)గా గుర్తించారు. రాకేశ్ మృతదేహం వద్ద తుపాకీ లభ్యం కావడంతో వీరి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ పట్టణానికి నైరుతి దిశగా 32 కిలోమీటర్ల దూరంలో డోవర్ పట్టణం ఉంది.

డోవర్ మాన్షన్‌లో గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వీరి మృతదేహాలను కనుగొనడమైందని నార్‌ఫోల్క్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డిఎ) మైకేల్ మొరిస్సే వెల్లడించారు. రెండు రోజులుగా వీరి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి బంధువు ఒకరు పోలీస్‌లకు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్‌లు ఆ భవంతికి వెళ్లి చూడగా మూడు మృతదేహాలు తప్ప మరెవరూ లేరు. ఈ సంఘటన ఘోరమైన గృహహింస వల్ల జరిగిందా ? లేక ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా లేదా బయటి వ్యక్తి ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీస్‌లు పరిశోధిస్తున్నారు.

విద్యాధికులైన రాకేష్ కమల్, ఆయన భార్య టీనా 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021 డిసెంబర్‌లో ఈ సంస్థ మూతపడినట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఏడాది సెప్టెంబర్ 22 న దివాళా పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు. ఎడ్యునోవా వెబ్‌సైట్ ప్రకారం రాకేష్ … బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ , స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. టీనా ఢిల్లీ యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమెకు రెడ్‌క్రాస్ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది. ఈ దంపతుల కుమార్తె అరియానా వెర్మాంట్ లోని ప్రైవేట్ లిటరల్ ఆర్ట్ స్కూల్ మిడిల్ బరీ కాలేజీలో న్యూరోసైన్స్ చదువుతోంది.

ఆర్థిక ఇబ్బందులు
ఇటీవలి కాలంలో ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు ఆన్‌లైన్ రికార్డులు చెబుతున్నాయి. కమల్ దంపతులు మసాచుసెట్స్‌లో అత్యంత ధనవంతులు ఉండే ఓ ఖరీదైన ప్రాంతంలో 2019లో 19 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ భవంతిని 4 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ భవంతిలో 11 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ భవంతి విలువ 5 మిలియన్ డాలర్లు (రూ. 41.26 కోట్లు ) ఉంటుందని అంచనా. ఈ భవంతిలోనే ఈ కుటుంబం ప్రస్తుతం ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ భవనాన్ని వారు తనఖా పెట్టినట్టు, వీరి ఆస్తులు కొన్ని జప్తు అయినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. రుణ చెల్లింపులు సరిగ్గా చేయలేక పోవడంతో ఏడాది క్రితం మసాచుసెట్స్‌కు చెందిన విల్సన్ డేల్ అసోసియేట్స్ సంస్థకు 3 మిలియన్ డాలర్లకు విక్రయించినట్టు ‘దిపోస్ట్’ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News