Friday, December 27, 2024

యూకె ప్రధాని రేసులో భారతీయుడు రిషి సునక్!

- Advertisement -
- Advertisement -

 

Rishi Sunak

లండన్: ఖజానా ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయడం వల్ల బోరిస్ జాన్సన్‌కు వ్యతిరేకంగా రాజీనామాల హిమపాతం సంభవించిన నేపథ్యంలో రిషి సునక్ తదుపరి యూకె ప్రధానమంత్రికి పోటీదారుగా భావిస్తున్నారు. అదే జరిగితే, బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారతీయ సంతతి వ్యక్తి అతనే అవుతాడు. 42 ఏళ్ల రిషి సునక్‌ను బోరిస్ జాన్సన్ ఎంపిక చేసి, ఫిబ్రవరి 2020లో తన తొలి పూర్తి స్థాయి క్యాబినెట్ లో  ఖజానా ఛాన్సలర్‌గా నియమించారు.

అతడిని మాజీ డిఫెన్స్ సెక్రటరీ పెన్నీ మోర్డాంట్తో పాటు సంయుక్త ఫేవరేట్ గా బుక్‌మేకర్లు,  లాడ్‌బ్రోక్స్ చూస్తున్నారు.  కోవిడ్ మహమ్మారి కాలంలో వ్యాపారాలు, కార్మికులకు పది బిలియన్ల పౌండ్ల భారీ ప్యాకేజీని రూపొందించి సాయపడినందుకు అతడు చాలా ప్రాచుర్యం పొందాడు. తన భార్య నాన్-డోమ్ స్టేటస్, తన అమెరికన్ గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయ సంక్షోభం కాలంలో వెనుకబడ్డాడన్న ముద్ర ఉండడంతో కాస్త తగ్గి ఉన్నాడు.

ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి  అయినప్పటికీ,  కోవిడ్ లాక్‌డౌన్‌ను ధిక్కరించినందుకు, డౌనింగ్ స్ట్రీట్ సమావేశంలో పాల్గొన్నందుకు అతనికి జరిమానా కూడా విధించబడింది.

రిషి సునక్ పూర్వికులు పంజాబ్ నుండి వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాలిఫోర్నియాలో విద్యార్థులుగా ఉన్నప్పుడు వారు ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News