Monday, December 23, 2024

కాలింగ్‌బెల్ కొట్టారని కోపంతో ముగ్గురి పిల్లల హత్య

- Advertisement -
- Advertisement -

అమెరికాలో భారతీయుడి అమానుషం

న్యూఢిల్లీ : కాలింగ్ బెల్ పదేపదే మోగించారన్న కోపంతో ఆడుకుంటున్న పిల్లలను వెంటాడి ముగ్గురిని హతమార్చిన భారత సంతతి వ్యక్తి కోర్టు ముందు దోషిగా తేలాడు. ఈ దారుణానికి ఒడి గట్టిన నిందితుడు రివర్‌సైడ్ కౌంటీ నివాసి అనురాగ్ చంద్రగా కోర్టు నిర్ధారించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ హత్యలు 2020 జనవరి 19న జరిగాయి. సంఘటన సమయంలో నిందితుడు అప్పటికే 12 బీర్లు తాగిన మత్తులో ఉన్నాడు. కాలింగ్ బెల్ కొట్టి పారిపోతున్న బాలుడు తనను హేళన చేశాడని కోపగించుకుని , ఆ ముగ్గురు బాలురు ప్రయాణిస్తున్న కారును వెంటాడేడు.

ఆ సమయంలో వారి కారును ఢీకొట్టడంతో అది టెమెస్కల్ వాలీలో చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 13 ఏళ్ల బాలుడు, మరో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. అంతకు ముందే నిందితుడు అనురాగ్ చంద్ర 2020లో గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితునికి జులై 14న జీవితఖైదు శిక్ష పడే అవకాశం కనిపిస్తోందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ముగ్గురు బాలురను హత్య చేయడం భయంకరం, అర్థం లేని విషాదంగా రివర్‌సైడ్ కౌంటీ జిల్లా న్యాయవాది ఆవేదన వెలిబుచ్చారు. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు చంద్ర తరఫు న్యాయవాది డేవిడ్ వోహి ఈ తీర్పు దురదృష్టంగా వ్యాఖ్యానించారు. కొత్తగా విచారణకు కోరతామని, కాదంటే తీర్పుపై అపీలు చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News