Sunday, December 22, 2024

సిఐఎ టెక్ అధికారిగా ముల్చందానీ

- Advertisement -
- Advertisement -

Indian-origin man Mulchandani is CIA's first chief tech officer

భారతీయ సంతతి వ్యక్తికి కీలక పదవి

వాషింగ్టన్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి నంద్ ముల్చందానీ సిఐఎ తొలి ప్రధాన సాంకేతికాధికారిగా నియమితులయ్యారు. అమెరికాలో నిఘా సమాచార సేవలతో సిఐఎ కీలక విభాగంగా ఉంది. ఈ సంస్థకు ఆయువుపట్టు అయిన టెక్నాలజీ ఆఫీసరుగా నియమితులు అయిన ముల్చందానీ ఢిల్లీలోని ఓ స్కూల్‌లో చదివారు. ఆయనకు సిలికాన్ వ్యాలీలో వివిధస్థాయిలో పనిచేసిన పాతికేళ్లకు పైగా విశేషానుభవం ఉందని, ఆయన నియామక ప్రకటనలో సిఐఎ డైరెక్టర్ విలియం జె బర్న్ తెలిపారు. డిఒడిలో కూడా పనిచేశారు. సిఐఎ సాంకేతికంగా మరింతగా ఎదిగేందుకు ఆయన అధికారిగా రావడం దోహదం చేస్తుందని అధికారిక ప్రకటనలో ఆయన పరిచయ వ్యాఖ్యల దశలో సిఐఎ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News