Thursday, January 23, 2025

బ్రిటన్‌లో కత్తిపోట్లకు భారత సంతతి వ్యక్తి బలి

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో క్యాంబర్‌వాల్ లోని సౌతాంప్టన్ వేలో ఓ అపార్టుమెంట్ బయట భారత సంతతికి చెందిన అరవింద్ శశికుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కత్తిపోట్ల గాయాలతో ఉండగా పోలీస్‌లు అతడ్ని గుర్తించారు. అయితే సంఘటన స్థలం లోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీస్‌లు వివరించారు.

అతడితో కలిసి ఉండే సల్మాన్ సలీస్ అనే 25 ఏళ్ల వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.శనివారం నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా, జూన్ 30 వరకు పోలీస్ కస్టడీ విధించారు. సలీం లండన్ ఓల్డ్ బెయిలీ కోర్టులో మంగళవారం హాజరు కావలసి ఉంది. సలీం, అరవింద్ ఇద్దరూ కేరళకు చెందిన వారే. శశికుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News