Saturday, April 5, 2025

అమెరికాలో భారతీయ మోటెల్ యజమాని కాల్చివేత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం న్యూపోర్టు సిటీలో భారతీయ సంతతికి చెందిన మోటెల్ యజయానిని ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటన బుధవారం జరిగింది. తాము వచ్చే సమయానికి మోటెల్ యజమాని 46 ఏళ్ల సత్యేన్ నాయక్ మోటెల్ బయట తూటా గాయాలతో పడి ఉన్నట్లు పోలీసులు చెపారు.

తీవ్రంగా గాయాలయిన నాయక్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మోటెల్‌లోని ఓ గదిలో నిందితుడు ట్రాయ్ కెల్లమ్ తలుపులు వేసుకుని దాక్కుని ఉన్నాడని, లొంగిపోవాలని కోరినా అతను పట్టించుకోలేదని, స్పెషల్ రెస్పాన్స్ టీమ్ గదిలోకి వెళ్లబోయే సరికి అతను తన దగ్గర ఉన్న హ్యాండ్‌గన్‌తో కాల్చుకుని చనిపోయాడని పోలీసు అధికారి కీత్ లూయిస్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News