Sunday, December 22, 2024

పెళ్లి చందా సొత్తు చోరీ కుట్ర

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో దోపిడి కుట్ర కేసులో భారతీయ సంతతికి చెందిన తల్లి కొడుకులు జైలుపాలయ్యారు. సిక్కు వర్గానికి చెందిన ఈ తల్లికొడుకులు 41 ఏండ్ల కల్వంత్ కౌర్, 22 సంవత్సరాల జంగ్ సింగ్ లంకన్‌పాల్ అక్టోబర్‌లో తాము చోరీకి యత్నించినట్లు అంగీకరించారు. స్థానిక సిక్కు సామాజిక వర్గం ఓ పెళ్లికి సాయం చేసేందుకు చందాలు స్వీకరించి పోగుచేసిన సొమ్మును కాజేసేందుకు వీరిరువురు ఫక్కా వ్యూహంతో వ్యవహరించినట్లు న్యాయస్థానం ముందు నేర నిరూపణ అయింది.

కౌర్‌కు 15 నెలల జైలు, లఖన్‌పాల్‌కు 30 నెలల జైలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మొత్తం 8000 పౌండ్ల డబ్బు స్థానిక సిక్కు సంస్థ సేకరించింది. ఈ డబ్బును నిర్వాహకులు లెక్కిస్తూ ఉండగా ఇరువురు ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. ఓ యువకుడు చేతిలోగన్ పట్టుకుని సొమ్ము ఇవ్వాలని బెదిరించాడు. ఆ తరువాత వెలుపల ఉన్న వ్యాన్‌లో ఉడాయించాడు. ఈ వ్యాన్ రెడ్ హ్యూండాయ్ ఓ మహిళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. పోలీసులు ఆరాతీయగా ఇది కల్వంత్ కౌర్‌దేనని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News