Tuesday, December 24, 2024

అమెరికన్ల మొగ్గు నిక్కీ హేలీ వైపే!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు 2024లో జరుగనున్నాయి. భారత సంతతి మహిళ, రిపబ్లికన్ నేత, దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండు సార్లు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. ఆమె గట్టి ప్రభావమే చూపబోతున్నారు. ఆమెకు ప్రజల్లో ఏ మాత్రం మద్దతు ఉందన్న ఒపీనియన్ పోల్ ఇటీవల నిర్వహించారు. డెమోక్రటిక్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే హేలీ ముందున్నారు. 45 శాతం మంది అమెరికన్లు హేలీకి ఓటేస్తామంటే, 41 మంది బైడెన్‌కు ఓటేస్తామన్నారు. ఇతరులకు ఓటేస్తామని మిగిలిన 10 శాతం మంది తెలిపారు.  ఇదిలావుండగా రిపబ్లికన్లలో ట్రంప్ (52 శాతం),  ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ (24 శాతం) తర్వాత ఆమె మూడవ స్థానంలో ఉన్నారు. ట్రంప్‌కు 74 శాతం మంది రిపబ్లికన్లు మద్దతునిస్తుండగా, 18 శాతం మంది నిక్కీ హేలీకి మద్దతునిస్తున్నారు.

అమెరికాలో తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5న జరుగనున్నాయి. నిక్కీ హేలీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడి, విజయం సాధిస్తే మాత్రం ఆమె అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలుగా కీర్తి పొందుతారు. కానీ ఎన్నికలు జరిగేనాటికి రాజకీయం ఎన్ని మలుపులు తిరుగనుందో…

Donald and Biden

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News