Saturday, November 2, 2024

లేడీ డాక్టర్‌ను కాల్చేసి తనూ చచ్చాడు

- Advertisement -
- Advertisement -

Indian-origin Pediatrician fatally shoots Lady Doctor

 

అమెరికాలో ఓ ఇండో డాక్టర్ దారుణం

హూస్టన్: అమెరికాలోని ఆస్టిన్‌లో భారతీయ సంతతికి చెందిన ఓ పిల్లల డాక్టరు బీభత్సం సృష్టించాడు. అక్కడి వైద్య కేంద్రంలోని వారిని బందీలుగా చేసుకుని, తరువాత అక్కడున్న లేడీ డాక్టర్‌ను కాల్చిచంపాడు. తరువాత తనను తాను కాల్చి చంపివేసుకున్నాడు. ఈ వ్యక్తిని డాక్టర్ భరత్ నరూమంచిగా గుర్తించారు. ఈ వ్యక్తికి ఇటీవలే ప్రాణాంతక క్యాన్సర్ ఉందని నిర్థారణ అయింది. ఈ వ్యక్తి ఓ గన్ తీసుకుని చిల్ట్రన్స్ మెడికల్ గ్రూప్ (సిఎంజి)కి చెందిన ఆఫీసులోకి చొరబడ్డారు. అక్కడున్న వారిని గన్‌తో బెదిరించి బందీలుగా చేసుకున్నాడు. తరువాత ఘాతకానికి పాల్పడ్డట్లు ఆస్టిన్ పోలీసు విభాగం పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యక్తి చాలా మందినే లోపల బందీగా చేశాడు.

అయితే చాలా మంది ఏదో విధంగా బయట పడ్డారు. కొందరు బయటకు వెళ్లిపోవడానికీ డాక్టరు అనుమతించాడు. అయితే లోపల లేడీడాక్టర్ కథేరినే డాడ్సన్‌ను బందీగానే ఉంచాడు. ఈలోగా బయటకు వచ్చిన వారు స్థానిక పోలీసు అధికారులకు లోపల పరిస్థితిని తెలిపారు. వ్యక్తి చేతిలో గన్ ఉందని ఏదైనా చేయవచ్చునని పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు ఏదో విధంగా లోపలికి వచ్చేసరికి ఆ వ్యక్తి డాక్టరును చంపేసి తానూ చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తి ఘటనకు వారం రోజుల ముందు ఇదే కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఇరువురు మధ్య ఏదైనా వైరం ఉందా? ఇంతకు ముందు ఆయన అక్కడికి వెళ్లినప్పుడు ఏదైనా వివాదం చెలరేగిందా? అనేది పోలీసులు నిర్థారించుకోలేపోతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News