Saturday, November 23, 2024

యుఎస్‌లో భారత సంతతి విద్యార్థిని అరెస్టు

- Advertisement -
- Advertisement -

యుఎస్‌లో ప్రతిష్ఠాకర ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఒక భారత సంతతి విద్యార్థినిని క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నందుకు మరొక విద్యార్థితో పాటు అరెస్టు చేసినట్లు విద్యార్థి, ఆలమ్ని వార్తాపత్రికలు వెల్లడించాయి. గురువారం తెల్లవారు జామున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసనకారులు గుడారాలు ఏర్పాటు చేసిన తరువాత తమిళనాడుకు చెందిన అచింత్య శివలింగం, హసన్ సయెద్‌లను అరెస్టు చేసినట్లు ప్రిన్స్‌టన్ ఆలమ్ని వీక్లీ (పిఎడబ్లు) తెలియజేసింది.

అక్రమంగా ప్రవేశించినందుకు ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు, వారిని ‘క్యాంపస్ నుంచి వెంటనే నిషేధించినట్లు’ వర్శిటీ అధికార ప్రతినిధి జెన్నిఫర్ మోర్రిల్ తెలిపారు. క్యాంపస్‌లో గుడారాలు ఏర్పాటు చేయడం వర్శిటీ విధానానికి ఉల్లంఘన అని మోర్రిల్ తెలిపారు. అయితే, వారిని ఖాళీ చేయించలేదని, వారి నివాస వసతిలోకి ప్రవేశించనిస్తున్నామని వర్శిటీ మరొక ప్రతినిధి మైకేల్ హాచ్‌కిన్స్ ఒక వార్తా పత్రికకు ధ్రువీకరించారు. శివలింగం ప్రిన్స్‌టన్‌లో అంతర్జాతీయ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ విద్యార్థిని కాగా సయెద్ అక్కడ పిహెచ్‌డి అభ్యర్థి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News