Sunday, April 20, 2025

భూమి వెలుపల కూడా జీవరాశి?

- Advertisement -
- Advertisement -

భూమికి వెలుపల కూడా ప్రాణి ఉందా? ఎక్కడ నిగూఢంగా దాగి ఉంది? అనే ప్రశ్నకు ఇప్పుడు కీలక సమాధానం దక్కింది. భూ బాహ్యంలో కూడా ప్రాణి ఉనికి ఉందనే విషయాన్ని తెలిపే అత్యంత కీలక , బలీయ ఆధారం ఒక్కటి అందుబాటులోకి వచ్చింది.జలచరాల నుంచి ఉత్పత్తి అయిన కణాలను భూమి వెలుపల గుర్తించారు. దీనితో ఇక సౌర వ్యవస్థకు వెలుపల కూడా ప్రాణి ఉందనే విషయం స్పష్టం అవుతోందని పరిశోధకులు తెలిపారు. అయితే సంబంధిత విషయంలో మరింతగా స్పష్టత రావల్సి ఉంటుంది. సౌర వ్యవస్థకు బాహ్య కక్షలో ఉండే గ్రహంలో ఈ జీవరాశి సంబంధిత సాక్షాన్ని పరిశోధకులు పసికట్టారు. ఈ గ్రహాన్ని కె 2 18 బిగా వ్యవహరిస్తున్నారు, భూమితో పోలిస్తే ఈ గ్రహం ఎనిమిదన్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఇంతకు ముందు కార్బన్ లక్షణపు కణాలైన మిథేన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటివి ఇక్కడనే కనుగొన్నారు. ఇది జీవ పరిణామ క్రమంలో కీలక పరిణామం అయింది. ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుని ఉన్న గ్రహం భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది స్టార్ కె2 18 చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ గ్రహం లోగుట్టు గురించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. సమాచారాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన టెలిస్కోప్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ లభ్యం అయిన పదార్థాలు, కణసముదాయం ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా ఉండటంతో దీనికి మరో ప్రాణి ఉనికికి సంబంధం ఉందనే కోణంలో ఈ అంశంపై మరింత సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News