ఖగోళ శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్. కులకర్ణి ప్రతిష్ఠాత్మక షా ప్రైజ్‌ను అందుకున్నారు. మిల్లీ సెకన్ల పల్సర్‌లు( వేగంగా నిత్యం పరిభ్రమించే న్యూట్రాన్ నక్షత్రం , దాని నుంచి అణుధార్మిక తరంగాలు వెలువడుతుంటాయి) , గామా రే పేలుళ్లు, సూపర్‌నోవాలు, ఇతర వేరియబుల్ లేదా ట్రాన్సియెంట్ ( తాత్కాలిక మార్పుల) ఖగోళ వస్తువుల గురించి కులకర్ణి చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ ప్రైజ్‌ను అందజేసినట్టు షా ప్రైజ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖగోళ శాస్త్రం , ప్లానెటరీ సైన్స్,ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ విభాగానికి ప్రొఫెసర్ గా జార్జ్ ఎలెరీ హేల్ ఉన్నారు. ఖగోళ శాస్త్రానికి కులకర్ణి చేసిన కృషిని షా ప్రైజ్ ఫౌండేషన్ టైమ్‌డొమైన్ ప్రశంసించింది. కులకర్ణి 1956 అక్టోబర్ 4న మహారాష్ట్ర లోని కురుంద్‌వాడ్ అనే పట్టణంలో జన్మించారు.
1978 లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన తరువాత ,1983లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి పిహెచ్‌డి చేశారు. 2006 నుండి 2018 వరకు కాల్టెక్ ఆప్టికల్ అబ్జర్వేటరీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనతోపాటు 2024 షాప్రైజ్ అందుకున్న వారిలో లైఫ్‌సైన్స్, మెడిసిన్‌లో అమెరికా నుండి స్వీలే థీన్, స్టువర్ట్ ఓర్కిన్, గణితశాస్త్రంలో పీటర్ సర్నాక్, ఉన్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన దివంగత ఫిలిం అండ్ టెలివిజన్ రంగాల ప్రముఖుడు రన్న్ షా ( 1907 2014) షా ఫౌండేషన్‌ను, చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ రెండు సంస్థలు విద్య, శాస్రవైజ్ఞానిక, సాంకేతిక పరిశోధన , వైద్య, సంక్షేమ సేవలు, సాంస్కృతిక, కళల రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రైజ్ అందిస్తారు. షా చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రైజ్‌ను ఖగోళ శాస్త్రం, లైఫ్ సైన్స్ , మెడిసిన్, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో మూడు వార్షిక బహుమతులను అందజేయడం పరిపాటిగా వస్తోంది. ఒక్కొక్క బహుమతికి 1.2 మిలియన్ల ప్రైజ్ మనీని అందిస్తారు.