Thursday, January 23, 2025

లండన్‌లో విద్యార్థిని సబిత హత్య

- Advertisement -
- Advertisement -

Indian-Origin Woman Murdered In Student Flat In London

భారతీయ సంతతి మహిళ, సైకాలజీ స్టూడెంట్

లండన్ : భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ యువతి సబితా థనవాని దారుణ హత్యకు గురయ్యారు. 19 సంవత్సరాల యువతి లండన్‌లోని తమ విద్యార్థుల హాస్టల్‌లోనే అత్యాచారం హత్యకు గురైనట్లు , ఘటనకు బాధ్యుడిగా అనుమానిస్తూ ట్యూనిషియా దేశస్థుడిని ఒకరిని అరెస్టు చేసినట్లు స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. శనివారం ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. లండన్‌లోని క్లర్కెన్వెల్ ప్రాంతంలోని హాస్టల్‌లో ఈ విద్యార్థి మెడపై కత్తిపోట్లకు గురై తీవ్రంగా రక్తస్రావం అయి మృతి చెందినట్లు గుర్తించారు. జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఓ అందమైన అపురూప దేవత జీవితం ఈ విధంగా విషాదంగా ముగిసిందని వ్యాఖ్యానించారు. హత్యకు గురైన యువతి సిటీ యూనివర్శిటీలో సైకాలజీ డిగ్రీకోర్సు చేస్తున్నారు. ఆమె ముందు ఎంతో జీవితం ఉంది. ఎప్పుడూ నవ్వుతూ కల్మషం లేకుండా ఉండేదని తల్లిదండ్రులు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News