Monday, December 23, 2024

కువైట్‌లో కారు ఢీకొని భారతీయుడు మృతి

- Advertisement -
- Advertisement -

కువట్ సిటీ: కువైట్‌లోని సల్మియా నగరంలో సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న నలుగురు విదేశీయులపై వేగంగా వస్తున్న ఒక కారు దూసుకెళ్లడంతో ఒక బారతీయుడితోసహా నలుగురు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. రలాజత్ వీధి వద్ద రోడ్డును దాటుతున్న నలుగురు వ్యక్తులపై కువైట్ పౌరుడికి చెందిన కారు ఒకటి వేగంగా దూసుకుపోయింనట్లు కువైట్ వెబ్‌సైట్ తెలిపింది.

ఈ ఘటనలో ఒక భారతీయుడితోపాటు గిజిప్టు, జోర్డాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరి కొందరు పాదచారులు కూడా గాయపడినట్లు తెలిసింది. పాదచారులను ఢీకొన్న అనంతరం కారు వైగంగా వెళ్లి ఒక రాతి గోడను ఢీకొన్నట్లు వెబ్‌సైట్ తెలిపింది. నలుగురు మరణానికి కారణమైన కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News