Sunday, January 19, 2025

లండన్ లో భారత పిహెచ్ డి విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ పిహెచ్ డి విద్యార్థిని మృతి చెందింది. భారత్ కు చెందిన 33ఏళ్ల చేష్ఠా కొచ్చర్‌ అనే విద్యార్థిని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పిహెచ్ డి చేస్తుంది. ఈనెల 19న సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

“చేష్ఠా కొచ్చర్‌ నాతోపాటు నీతి ఆయోగ్‌లో ‘లైఫ్‌’ ప్రోగ్రాంపై పనిచేశారు. బిహేవియరల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు వెళ్లారు. సైక్లింగ్‌ చేస్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చాలా తెలివైన వ్యక్తి. ధైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా” అని ఆయన పోస్ట్ చేశారు.

చేష్ఠా.. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ SP కొచ్చర్ కుమార్తె. “నేను ఇప్పటికీ లండన్‌లో ఉన్నాను. నా కుమార్తె ఛైస్తా కొచ్చర్ భౌతికాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. మార్చి 19న ఆమె పీహెచ్‌డీ చేస్తున్న ఎల్‌ఎస్‌ఈ నుంచి సైకిల్‌పై తిరిగి వెళుతుండగా ట్రక్కు ఢీకొట్టింది. ఇది మమ్మల్ని ఎంతో బాధకు గురి చేసింది అంటూ ఎస్పీ కొచ్చర్.. తన కుమార్తెను గుర్తుచేసుకుంటూ ఎక్స్ లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News