లండన్: టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనా కలకలం రేపింది. జట్టు సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని బిసిిసిఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన డబ్ల్యూటిసి ఫైనల్ తలపడి టీమిండియా.. ఆగస్టు నెలలో ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉంది.
ఈ సిరీస్ కు దాదాపు 40 రోజుల సమయం ఉండటంతో జట్టు యాజమాన్యం ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఇంగండ్ లోని పలు ప్రాంతాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, బుధవారంతో ఆటగాళ్లకు ఇచ్చిన గడువు పూర్తికావడంతో గురువారం టీమిండియా ఆటగాళ్లందరూ దుర్హమ్ లో బయోబుడగలోకి వెళ్లనుండగా.. ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకినట్లు తెేలింది. దీంతో సదరు ఆటగాడిని ఒక్కడినే ఒకచోట ఐసోలేషన్ లో ఉంచామని, ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, మిగతా ఆటగాళ్లు బయోబుడగలోకి వెళ్లనున్నారు.
Indian player test positive for Covid in England