Monday, December 23, 2024

టీమిండియా క్రికెటర్ల ఆడవిడుపు

- Advertisement -
- Advertisement -

Indian Players visit Rottnest Island in Australia

పెర్త్: ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు బుధవారం విహారయాత్రకు వెళ్లారు. పెర్త్ నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ ఐస్‌లాండ్ రాట్‌నెస్ట్‌ను భారత ఆటగాళ్లు సందర్శించారు. కొన్ని రోజులుగా వార్మప్ మ్యాచ్‌లు, కఠోర సాధనలో ఉన్న క్రికెటర్లు బుధవారం ప్రముఖ వైల్డ్‌లైఫ్ కేంద్రంగా పేరున్న రాట్‌నెస్ట్ ఐలాండ్‌లో సందడి చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, భువనేశ్వర్ తదితరులు ఐస్‌లాండ్‌లోని జంతువులతో సరదాగా గడిపారు. ఈ విహారయాత్రలో క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది.

Indian Players visit Rottnest Island in Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News